Share News

Rajam ranks first in ‘Swachh Andhra... Swarna Andhra’ ‘స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర’లో రాజాం ఫస్ట్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:46 PM

Rajam ranks first in ‘Swachh Andhra... Swarna Andhra’ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం అమలులో రాజాం మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది. 50వేల లోపు జనాభా కలిగి ఉన్న మున్సిపాలిటీల విభాగంలో స్వచ్ఛ మున్సిపాలిటీస్‌ కేటగిరీలో మొదటిస్థానాన్ని కైవశం చేసుకుంది.

Rajam ranks first in ‘Swachh Andhra... Swarna Andhra’ ‘స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర’లో రాజాం ఫస్ట్‌
రాజాం మున్సిపాలిటీ

‘స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర’లో రాజాం ఫస్ట్‌

గ్రేడ్‌ 2 మున్సిపాలిటీలలో రాష్ట్రంలో మొదటిస్థానం

అందరి కృషితోనే: కమిషనర్‌

రాజాం రూరల్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం అమలులో రాజాం మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది. 50వేల లోపు జనాభా కలిగి ఉన్న మున్సిపాలిటీల విభాగంలో స్వచ్ఛ మున్సిపాలిటీస్‌ కేటగిరీలో మొదటిస్థానాన్ని కైవశం చేసుకుంది. పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం వంటి వివిధ అంశాలలో మున్సిపాలిటీ చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డు దక్కింది.

మరిన్ని కారణాలివే..

ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాలను వేరుచేయడం, ఘనవ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ఎఫ్‌ఎస్‌టీపీ సమర్థ నిర్వహణ, కమ్యూనిటీ, పబ్లిక్‌ మరుగుదొడ్ల నిర్వహణ, రెడ్యూస్‌, రీ యూజ్‌, రీ సైకిల్‌ విధానాలను ప్రోత్సహించడం, మేడ, మిద్దె పంటలు, హోం కంపోస్టింగ్‌, సింగిల్‌యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణ, పట్టణసుందరీకరణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను సమర్థంగా నిర్వహించడంతో ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.

అందరి సహకారంతోనే..

మున్సిపాలిటీలో అభివృద్ధి, సుందరీకరణ కార్యక్రమాల నిర్వహణకు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సంపూర్ణ సహకారం అందించారు. ఇదే సమయంలో పట్టణ ప్రజల చేయూత, శానిటరీ అధికారి ప్రసాదరావు, సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది అండదండలతో రాజాం మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం దక్కిందని కమిషనర్‌ రామచంద్రరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్లు కమిషనర్‌ వివరించారు.

Updated Date - Sep 30 , 2026 | 11:46 PM