Rajam.. as it is. రాజాం.. యథాతథం
ABN , Publish Date - May 17 , 2026 | 11:53 PM
Rajam.. as it is. రాజాం మున్సిపాలిటీకి మరోసారి మొండిచేయి మిగిలింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలలో వార్డుల విభజనకు సోమవారం అధికారిక ప్రకటన జారీ అవుతోంది. రాజాంను విస్మరించారు. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రాజాం ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంది. ఇకపైనా అదే పరిస్థితి కొనసాగనుంది.
రాజాం.. యథాతథం
వార్డుల విభజనకు బ్రేక్
బొబ్బిలి, విజయనగరం, నెల్లిమర్లలో నేడు అధికారిక ప్రకటన విడుదల
రెండు దశాబ్దాలుగా ప్రత్యేకాధికారి పాలనలోనే రాజాం
రాజాం రూరల్, మే 17(ఆంధ్రజ్యోతి): రాజాం మున్సిపాలిటీకి మరోసారి మొండిచేయి మిగిలింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలలో వార్డుల విభజనకు సోమవారం అధికారిక ప్రకటన జారీ అవుతోంది. రాజాంను విస్మరించారు. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రాజాం ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంది. ఇకపైనా అదే పరిస్థితి కొనసాగనుంది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్యను పెంచే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా సోమవారం పెరిగిన వార్డులకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. అయితే రాజాం మున్సిపాలిటీలో మాత్రం వార్డుల సంఖ్యలో మార్పులేదు. రాజాం నగర పంచాయతీగా ఏర్పడి థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినా న్యాయస్థానంలో వివాదం ఉండడంతో రెండు దశాబ్దాలుగా ఎన్నికల నిర్వహణకు నోచుకోలేదు. ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగుతోంది. ఫలితంగా ఇప్పుడూ వార్డుల సంఖ్య పెంపునకు నోచుకోలేదు.
2005 అక్టోబరులో రాజాం నగర పంచాయతీగా ఆవిర్భవించింది. మూడేళ్ల క్రితం(2023) థర్డ్‌గ్రేడ్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. వాస్తవానికి ఇప్పటికే నాలుగు పాలక వర్గాల గడువు పూర్తయి ఐదో పాలకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధం కావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉంది. ఇరవై ఏళ్లుగా ఎన్నికలకు నోచుకోలేదు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో వార్డుల పునర్విభజనకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎక్కడెక్కడ ఎన్నివార్డులు పెంచాలో ఇప్పటికే నిర్ణయించారు. నగర పంచాయతీ ఏర్పడినప్పుడు రాజాంలో 20 వార్డులు ఉండగా 2023లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడంతో ఈ సంఖ్య 24కి చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన జరుగుతుండడంతో రాజాంలో వార్డుల సంఖ్య 24 నుంచి 32కి పెరగాల్సి ఉంది. అయితే ఎన్నికలు జరగకపోవడం, పాలకవర్గం లేకపోవడం, వివాదం న్యాయస్థానంలో ఉండడంతో రాజాంలో వార్డుల సంఖ్య పెంపుదల ఇప్పట్లో లేనట్లే. ఈ విషయాన్ని రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద ధ్రువీకరించారు.
ఫ రెండు దశాబ్దాలుగా ఎన్నికలకు నోచుకోని రాజాం మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పలుమార్లు చర్చించారు. అయితే కోర్టునాశ్రయించిన మూడు పంచాయతీలలో రెండు పంచాయతీల ప్రజాప్రతినిధులు మున్సిపల్ పాలనకు అనుకూలంగా ఉన్నా కొత్తవలస గ్రామస్థులు తమకు పంచాయతీ పాలనే కావాలని పట్టుపడుతున్నారు. మున్సిపాలిటీలో ఉంటే పేద కుటుంబాలకు ఉపాధిహామీ పథకం అందకుండా పోతుందని వారి ప్రధాన ఆవేదనగా ఉంది.
జిల్లాలో వార్డుల పెంపుదల ఇలా..
............................................................................................................................
మున్సిపాలిటీ పేరు వార్డుల సంఖ్య ప్రస్తుతం సంఖ్య
..............................................................................................................................
విజయనగరం కార్పొరేషన్ 50 62
బొబ్బిలి మున్సిపాలిటీ 31 36
నెల్లిమర్ల నగరపంచాయతీ 20 23
రాజాం మున్సిపాలిటీ 24 ......