Rain ఈదురుగాలులతో వాన
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:21 AM
Rain Accompanied by Gusty Winds సాలూరు అర్బన్, రూరల్‌లో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆశ్చర్చపోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది.
సాలూరు రూరల్, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): సాలూరు అర్బన్, రూరల్‌లో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆశ్చర్చపోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గాలుల కారణంగా కరకవలస వద్ద దండిగాం రోడ్డుపై అడ్డంగా భారీ చెట్టు నేలకూలింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు కాసేపు ఇక్కట్లు తప్పలేదు.