కేంద్రం దృష్టికి రైల్వే, రహదారుల సమస్యలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:17 AM
విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న రైల్వే, రహ దారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
ఎంపీ కలిశెట్టి
విజయనగరం రూరల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న రైల్వే, రహ దారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని ప్రధాన రైళ్లకు జి.సిగడాం, చీపురుపల్లి తదితర ప్రాంతా ల్లో హాల్ట్‌లు కల్పించాలని కోరామన్నారు. దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం మీదుగా పాలకొండ- హద్దుబంగి రోడ్డు, పొందూరు, చిలకపాలెం తదితర రోడ్ల విషయమై మరో పర్యాయం కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ఇవి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టుకు కనెక్టవిటీ రోడ్ల విషయమై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. జూన్, జూలైలో ఈ కార్యక్రమా న్ని పార్లమెంటు నియోజకవర్గం మొత్తంగా చేపడతా మన్నారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ఆల్తి బంగారుబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.