Share News

రాజాంలో దుకాణాలపై దాడులు

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:11 AM

: రాజాంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు మంగవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు చికెన్‌, మటన్‌, చేపలు, పండ్ల దుకాణాల్లో కాటాలను తనిఖీ చేసి తూకంలో తేడాలున్నట్లు గుర్తించారు.

రాజాంలో దుకాణాలపై దాడులు
పండ్ల బండి వద్ద తనిఖీ చేస్తున్న లీగల్‌ మెట్రాలజీ అధికారులు

రాజాం రూరల్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రాజాంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు మంగవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు చికెన్‌, మటన్‌, చేపలు, పండ్ల దుకాణాల్లో కాటాలను తనిఖీ చేసి తూకంలో తేడాలున్నట్లు గుర్తించారు. తక్కువ తూకంతో కొనుగోలుదారులను మోసగిస్తున్న 17మందిపై కేసులు నమోదు చేశారు. వీరిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని బొబ్బిలి లీగల్‌ మెట్రాలజీ ఇనస్పెక్టర్‌ రామారావు తెలిపారు. ప్రతి తూకం యంత్రానికి తమశాఖ వేసిన సీల్‌ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.

Updated Date - Aug 19 , 2026 | 12:11 AM