Share News

పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు: డిప్యూటీ సీఎం పవన్‌ అసంతృప్తి

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:45 PM

బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు వెలుగు చూడడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ త్రీవంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల నివేదిక ఆధారంగా పనుల తీరును తెలుసుకున్న ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు: డిప్యూటీ సీఎం పవన్‌ అసంతృప్తి

  • బిల్లులు నిలిపివేసి.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశం

పార్వతీపురం, జూలై28(ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు వెలుగు చూడడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ త్రీవంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల నివేదిక ఆధారంగా పనుల తీరును తెలుసుకున్న ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిల్లులు నిలిపివేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాస్తవంగా పెదపెంకిలో నిర్మించిన కొన్ని సిమెంట్‌ రహదారులు పగుళ్లు ఏర్పడిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్రస్థాయి చీఫ్‌ క్యాలీటీ కంట్రోల్‌ అధికారుల బృందం ఆ గ్రామంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఐదు సీసీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు గుర్తించి.. నివేదిక అందించారు. దీని ఆధారంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా నాణ్యత లోపాలు లేకుండా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

Updated Date - Jul 29 , 2026 | 02:07 PM