Share News

గిరిజనులకు నాణ్యమైన వస్తువులు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:04 AM

జీసీసీ ద్వారా గిరిజనులకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని ఆ సంస్థ పార్వతీపురం బ్రాంచ్‌ మేనేజర్‌ సాంబశివరావు తెలిపారు. శనివారం మండలంలోన కూనేరుసంతలో జీసీసీ ఆధ్వర్యంలో రెండు దుకాణాలు ఏర్పాటుచేసి వస్తువులు విక్రయించారు.

  గిరిజనులకు నాణ్యమైన వస్తువులు
జీసీసీ దుకాణాల్లో వస్తువులు కొనుగోలును పరిశీలిస్తున్న సాంబశివరావు:

కొమరాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జీసీసీ ద్వారా గిరిజనులకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని ఆ సంస్థ పార్వతీపురం బ్రాంచ్‌ మేనేజర్‌ సాంబశివరావు తెలిపారు. శనివారం మండలంలోన కూనేరుసంతలో జీసీసీ ఆధ్వర్యంలో రెండు దుకాణాలు ఏర్పాటుచేసి వస్తువులు విక్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసీసీ డిపోల్లో గిరిజనులకు నాణ్యమైన వస్తువులు అందజేసి విక్రయించనున్నట్లు తెలిపారు. గిరిజనులు పండించే ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి గిరిజనులను ఆర్థికంగా ఆదు కుంటున్నామని చెప్పారు.ఏజెన్సీప్రాంతాల్లో గిరిజనులు దళారుల చేతిలో మోస పోయి తమ పంటలు తక్కువ ధరలకు అమ్ముకొని ఆర్థికంగా నష్టాలు చవి చూస్తున్నారన్నారు. గిరిజనుల పండించే చింతపండు, కొండచీపుర్లతోపాటు ఇతర ఉత్పత్తులను జీసీసీ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెల్స్‌మన్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:04 AM