Share News

Pulse Polio 28న పల్స్‌పోలియో

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:02 AM

Pulse Polio Drive on June 28 జిల్లాలో ఈనెల 28న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పల్స్‌పోలియో ముందస్తు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.

Pulse Polio    28న పల్స్‌పోలియో
పల్స్‌పోలియో వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణలో జేసీ, డీఎంహెచ్‌వో తదితరులు

పార్వతీపురం, జూన్‌22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 28న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పల్స్‌పోలియో ముందస్తు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 28న బూత్‌లలో పోలియో చుక్కలు వేస్తారని, 29, 30 తేదీల్లో ఇళ్లకు వెళ్లి పిల్లలకు పోలియో వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ లోపుగా మండల టాస్క్‌ఫోర్స్‌ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. విద్యాశాఖ సిబ్బంది సహకారంతో ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి కేంద్రాలకు వచ్చేలా సన్నద్ధం చేయాలని జడ్పీ సీఈవో, ఎంపీడీవోలను ఆదేశించారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు జూన్‌ 24 నుంచి 30 వరకు జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆ శాఖాధికారులకు సూచించారు.

- పల్స్‌ పోలియోకు సంబంధించి కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ హేమలత వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. అనంతరం కార్యక్రమం నిర్వహణపై డీఎంఅండ్‌హెచ్‌వో భాస్కరరావు వివరించారు. ఈ కార్య క్రమంలో డీసీహెచ్‌వోఎస్‌ నాగభూషణరావు, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు విజయమోహన్‌, జగన్‌, కౌశిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:02 AM