Pulse Polio పల్స్‌పోలియోకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:43 PM
Pulse Polio Arrangements Completed జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 15 మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, పాలకొండ నగర పంచాయతీలో ఐదేళ్ల లోపు 99,507 పిల్లలకు చుక్కల మందులు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పార్వతీపురం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 15 మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, పాలకొండ నగర పంచాయతీలో ఐదేళ్ల లోపు 99,507 పిల్లలకు చుక్కల మందులు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 905 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. 42 మొబైల్ కేంద్రాలు, 19 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మన్యంలో 209 హైరిస్క్ గ్రామాల్లోని 3,645 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు కూడా ఏర్పాట్లు పూర్తిచేశారు. 3,620 మంది సిబ్బందితో పాటు 93 మంది సూపర్‌వైజర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాను న్నారు. ఇక సోమ, మంగళవారాల్లో 1810 బృందాలు ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు చుక్కలు వేయనున్నాయి. పిల్లల బంగారు భవిష్యత్ కోసం విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. జిల్లాలో పల్స్‌పోలియో నిర్వహణకు ఏర్పా ట్లు పూర్తి చేశామని మరోవైపు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. లక్ష్యాల మేరకు కార్యక్రమం నిర్వహించాలని ఈ మేరకు వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అనంతరం శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నా రులకు పోలియో డ్రాప్స్ వేసే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు విజయమోహన్, జగన్మోహన్, రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.