Share News

ప్రజాసంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:52 PM

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా నిలుస్తోందని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు ( బేబీనాయన ) తెలిపారు. బొబ్బిలిలో 34 మందికి ఆదివారం సీఎం సహాయనిధి సహాయ చెక్కులను పంపిణి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. నియోజకవర్గ ప్రజ లకు ఏసమస్య వచ్చినా తనదృష్టికి తేస్తే పరిష్కారానికికృషి చేస్తానన్నారు.

 ప్రజాసంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే
సీఎం సహాయనిధి చెక్కులు అందుకున్నవారితో బేబీనాయన

బొబ్బిలి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి ): పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా నిలుస్తోందని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు ( బేబీనాయన ) తెలిపారు. బొబ్బిలిలో 34 మందికి ఆదివారం సీఎం సహాయనిధి సహాయ చెక్కులను పంపిణి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. నియోజకవర్గ ప్రజ లకు ఏసమస్య వచ్చినా తనదృష్టికి తేస్తే పరిష్కారానికికృషి చేస్తానన్నారు.

రిజర్వేషన్ల కోసం కృషి చేయాలి

ఓసీకాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన అనేక సమస్యలను పరిష్కరించాలని తెలగ రిజర్వేషన్‌ పోరాటసమితి, రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చనుమల్లు ప్రసాద్‌ కోరారు. ఈ సమస్యల సాధన కోసం కృషి చేయాలని ఆదివారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనకు ఆయన నివాసంలో చనుమల్లు వినతిపత్రం సమర్పించారు. బొబ్బిలిలో తెలగ కళ్యా ణమండపం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని ,ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ ద్వారా రుణాలను తక్షణం మంజూరు చేయించాలని కోరారు. ఈ వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Jan 04 , 2026 | 11:52 PM