Share News

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:12 AM

: గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మండలంలోని నారంనాయుడువలస నుంచి శ్రీరంగరాజపురం వరకు నిర్మించనున్న బీటీరోడ్డుకు శంకుస్థాపనచేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ ప్రస్తుతం రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గలావల్లి - గంగాడ రోడ్డు పనులు పూర్తయ్యాయని, పణుకువలస, అరసాడ, గౌరీపురం - పి.చాకి రాపల్లి, నారాయణపురం, తదితర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

 ప్రజా సంక్షేమమే ధ్యేయం
బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర:

సీతానగరం (బలిజిపేట), అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మండలంలోని నారంనాయుడువలస నుంచి శ్రీరంగరాజపురం వరకు నిర్మించనున్న బీటీరోడ్డుకు శంకుస్థాపనచేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ ప్రస్తుతం రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గలావల్లి - గంగాడ రోడ్డు పనులు పూర్తయ్యాయని, పణుకువలస, అరసాడ, గౌరీపురం - పి.చాకి రాపల్లి, నారాయణపురం, తదితర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బలిజిపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే మంచినీటి పథకానికి శంకుస్థాపన చేస్తామని, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలి పారు. మార్చి నాటికి నియోజకవర్గంలో డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

Updated Date - Oct 04 , 2026 | 12:12 AM