ప్రజా సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:14 AM
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.
చీపురుపల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. బుధవారం కరకాం, పీఎస్ లక్ష్మీపురం గ్రామాలకు చెందిన పి.అప్పలనాయుడు, జె.మహలక్ష్మికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.81,201ల చెక్కులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా భరోసా లభిస్తుందన్నారు.