Public Service ప్రజాసేవే లక్ష్యం
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:22 PM
Public Service is Our Mission ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయనున్నట్లు నూతన సబ్ కలెక్టర్ సచిన్ అర్పిత్ రహర్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
పార్వతీపురం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయనున్నట్లు నూతన సబ్ కలెక్టర్ సచిన్ అర్పిత్ రహర్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ పారదర్శకంగా అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. రెవెన్యూ సేవలు, ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల సహకారంతో పార్వతీపురం సబ్ డివిజన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్‌కు వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ సంఘం ప్రతినిధులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.