Share News

Public Health ప్రజారోగ్యమే లక్ష్యంగా..

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:55 PM

Public Health Is the Priority గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా సగం నిర్మాణంలో నిలిచిపోయిన హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వాటి నిర్మాణం పూర్తికి నిధులు మంజూరు చేసింది.

Public Health  ప్రజారోగ్యమే లక్ష్యంగా..
లక్ష్మీనారాయణపురంలో వెల్‌నెస్‌ సెంటర్‌ భవన నిర్మాణం చేపడుతున్న దృశ్యం

  • భవన నిర్మాణాలపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం

  • పనుల పూర్తికి నిధులు మంజూరు చేసిన కూటమి

పార్వతీపురం, జూలై15(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా సగం నిర్మాణంలో నిలిచిపోయిన హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వాటి నిర్మాణం పూర్తికి నిధులు మంజూరు చేసింది. పీఎం ఆయుష్మాన్‌భారత్‌ కింద జిల్లాలోని 65 హెల్త్‌ వెల్‌సెంటర్ల సెంటర్లను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 35.75 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.నాలుగు కోట్లతో మరో 11 భవన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పథకం కింద మరో 40 కేంద్రాల నిర్మాణానికి సుమారు రూ.ఆరు కోట్లు మంజూరు చేసింది. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రతి సచివాలయం పరిధిలో ఒక హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. అయితే భవనాల పనులను మాత్రం పూర్తి చేయలేకపోయారు. నామినేటెడ్‌ పద్ధతిలో అప్పట్లో స్థానిక సర్పంచ్‌లు లేదా ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులకు వాటి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అయితే పూర్తయిన పనుల ప్రాస్తికి సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. కాగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న కూటమి సర్కారు హెల్త్‌ వెలెన్‌స్‌ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చకాచకా భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:55 PM