Public Grievance మండలాల వారీగా ప్రజాదర్బారు
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:53 PM
Public Grievance Meetings at the Mandal Level ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాకేంద్రం, నియోజకవర్గాలకు తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఇకపై ఇకపై అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించి పరిష్కరించే విధంగా ప్రతినెలా మండలాల వారీగా ప్రత్యేక ప్రజాదర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ‘ఒక నెల -ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పీజీఆర్‌ఎస్ నిర్వహించారు.
ఇకపై ప్రతినెలా నిర్వహణ
ప్రజల వద్దకే అధికారులు
సమస్యల పరిష్కారానికి చర్యలు
మక్కువ(సాలూరు), సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాకేంద్రం, నియోజకవర్గాలకు తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఇకపై ఇకపై అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించి పరిష్కరించే విధంగా ప్రతినెలా మండలాల వారీగా ప్రత్యేక ప్రజాదర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ‘ఒక నెల -ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల ప్రజలు ఇచ్చిన 93 అర్జీలను స్వీకరించి పరిశీలించారు. శాఖల వారీగా అధికారులకు ఆయా అర్జీలను అందించి.. త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అత్యధికంగా భూ సమస్యలపైనే అర్జీలు వచ్చాయని రెవె న్యూ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. హౌస్ మ్యాపింగ్, తల్లికి వందనం, దివ్యాంగులు సమస్యలపై డీఈవో, డీఎంహెవోలు దృష్టి సారించాలన్నారు. సాలూరు పట్టణాభి వృద్ధికి రూ.15కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయన్నారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. పార్కుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా పీడీలు ప్రభావతి, నాగభూషణరావు, కె.రామచంద్రరావు, డీఈవో పి.బ్రహ్మజీరావు, డిఎంహెచ్‌వో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.