సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:05 AM
నియోజ వర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్క రించేందుకు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు.
లక్కవరపుకోట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): నియోజ వర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్క రించేందుకు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు. శుక్రవారం ఎల్.కోటలోని తన నివాసం వద్ద ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజ ల నుంచి వినతులు స్వీకరించారు. పీఏసీఎస్ అధ్యక్షు డు జీఎస్.నాయుడు, ఎల్.కోట మండల కార్యదర్శి గండి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పోలిపల్లి గ్రామంలో టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రో తు బంగార్రాజు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ భూములు ఐటీ పరిశ్ర మలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వాటిని కాపాడాలని భోగాపురం, ముంజేరు గ్రామాలకు చెందిన రైతులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. అంతకముందు గాంధీజీ చిత్రపటానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు.
విజయనగరం రూరల్, జనవరి 30(ఆంధ్ర జ్యోతి): స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అతిది గజపతిరాజు శుక్రవా రం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని, సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని, ఇళ్లు, ఇంటి రుణాలు, అదే విధంగా సీఎం రీలిఫ్‌ఫండ్ ద్వారా సాయం అందించాలని పలువురు కోరారు. విన తులు స్వీకరించిన ఎమ్మెల్యే.. ఆయా సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని చెప్పారు.
చీపురుపల్లి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్ నాయుడు వినతి పత్రా లు స్వీకరించారు. అనంతరం మెయిన్ రోడ్డులో గాంధీ జీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ నాయకులు దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, ముల్లు రమణ, వెన్నె సన్యాసినాయుడు, గంట్యాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.