Public anger over the attitude of the dominant elite. పెత్తందారుల తీరుపై ప్రజాగ్రహం
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:31 PM
Public anger over the attitude of the dominant elite. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఓ కంపెనీకి దశాబ్దాల కిందట భూములు ఇచ్చిన రైతులు తర్వాత రోజుల్లో ఆ భూముల్లో ఎలాంటి కట్టడాలు చేపట్టకపోవడంతో ఎప్పటిలా సాగు చేసుకుంటున్నారు. వాటిపై ఆధారపడి బతుకుతున్నారు. ఇది సహించని పెత్తందారులు ఆ భూములను కబ్జా చేసేందుకు ఎత్తుగడ వేశారు. విషయం తెలుసుకున్న రైతులంతా ఉద్యమించారు.
పెత్తందారుల తీరుపై
ప్రజాగ్రహం
దశాబ్దాల కిందట ఓ కంపెనీకి భూములు ఇచ్చిన రైతులు
వాటిని స్వాధీనంలోకి తీసుకున్న వివిధ పార్టీల నాయకులు
పూర్తిగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు
విషయం తెలిసి తాజాగా నిరసనకు దిగిన రైతులు
ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఓ కంపెనీకి దశాబ్దాల కిందట భూములు ఇచ్చిన రైతులు తర్వాత రోజుల్లో ఆ భూముల్లో ఎలాంటి కట్టడాలు చేపట్టకపోవడంతో ఎప్పటిలా సాగు చేసుకుంటున్నారు. వాటిపై ఆధారపడి బతుకుతున్నారు. ఇది సహించని పెత్తందారులు ఆ భూములను కబ్జా చేసేందుకు ఎత్తుగడ వేశారు. విషయం తెలుసుకున్న రైతులంతా ఉద్యమించారు. ఆ భూములు తమకే చెందాలని, ఇతరులకు దక్కనివ్వబోమని భీష్మించారు. తాజాగా సోమవారం బాడంగి రెవెన్యూకు చెందిన భూముల్లో భారీగా నిరసనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి చర్చలకు పిలిచారు. దీంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు.
బాడంగి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):
డొంకినవలస, బాడంగి రెవెన్యూ పరిధిలో ఉన్న భూముల్లో ప్రశాంతంగా సాగుచేసుకుంటున్న రైతులు ఒక్కసారిగా ఉద్యమించారు. తాము గతంలో ఓ కంపెనీకి ఇచ్చిన భూముల్లో కొత్తగా పెత్తందారులు ప్రవేశించినట్లు తెలిసి ఆందోళన చెందారు. బోరు కూడా వేసినట్లు తెలిసి పోరాటానికి దిగారు. రైతులతోపాటు కొందరు నాయకులు, ఆ గ్రామ ప్రజలు సోమవారం ధర్నా చేశారు. రైతులకు వైసీపీకి చెందిన గండి శంకరరావు, టీడీపీకి చెందిన గండి వెంకటి మద్దతుగా నిలిచారు. కంపెనీ భూములు రైతులకే చెందాలని, పెత్తందారులు గుప్పెట్లోకి వెళ్లకూడదని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. సమస్యపై చర్చించేందుకు బొబ్బిలి డీఎస్పీ కార్యాలయానికి పిలిచారు. దీంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించి బొబ్బిలి వెళ్లారు.
అసలు ఏం జరగిందంటే..
కలకత్తాకు చెందిన మహవీర్ కంపెనీ వ్యక్తులు 1980-81 ప్రాంతంలో బాడంగి, డొంకినవలస రెవెన్యూలలో 31 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. అప్పట్లో కంపెనీ యాజమాన్యం ఈ భూమి చుట్టూ ప్రహరీతోపాటు నాలుగు చోట్ల షెడ్లు నిర్మించింది. ఆపై ఎలాంటి నిర్మాణాలు సాగలేదు. ఆ తర్వాత ఆ భూముల్లో సుమారు 10 ఎకరాల్లో మామిడితోట ఉండేది. కాగా ఈ భూములు కొంతకాలం పాటు అనధికారిక అగ్రిమెంట్‌పై కొందరు వ్యక్తుల చేతులు మారాయి. 2014-19లో టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఈ భూముల కొనుగోలుకు కలకత్తా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని కొంత సొమ్ము కూడా చెల్లించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చీపురుపల్లి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు టీడీపీ నేత నుంచి నామమాత్రపు అగ్రిమెంట్‌పై ఆ భూములను కొనుగోలు చేశాడు. ఆపై వైసీపీ నాయకుడు విశాఖకు చెందిన వ్యక్తితో అగ్రిమెంట్‌పై భూములను విక్రయించాడు. అయితే మొత్తం భూమిలో బాడంగి రెవెన్యూకు చెందిన సుమారు 12 ఎకరాలు మొదటి నుంచి కంపెనీ పేరున ఉన్నాయి. డొంకినవలసకు చెందిన 19 ఎకరాలు కంపెనీ పేరు నుంచి నోషనల్ ఖాతాలోకి మారినట్లు సమాచారం. ఏదైనాగాని తమ భూముల్లో కంపెనీ ఏర్పాటు చేయకపోవడంతో డొంకినవలస రైతులు చాలా సంవత్సరాలుగా ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో వ్యక్తులు కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసి ఉద్యమ బాట పట్టారు.