పని కల్పించండి
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:19 AM
తమకు పని కల్పించాలని కోరుతూ ఫేకర్ కాంట్రాక్టు కార్మికు లు శుక్రవారం ఆ కర్మాగారం ఎదుట నిరసన చేపట్టారు.
గరివిడి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): తమకు పని కల్పించాలని కోరుతూ ఫేకర్ కాంట్రాక్టు కార్మికు లు శుక్రవారం ఆ కర్మాగారం ఎదుట నిరసన చేపట్టారు. కర్మాగారం మూసివేతతో ఉపాధి కోల్పో యామని 91 మంది కార్మికులు తమ వేదన వ్యక్తం చేశారు. వేరే ప్రాంతాలకు చెందిన వారితో పనిచేయిస్తున్నారు కానీ తమకు అదే పని చేసే అవకాశం కల్పిం చకపోడవం విచారకరమన్నారు. ఫేకర్‌లో అన్ని విభాగాల్లో పనిచేసే కార్మికులకు సెటిల్‌మెంట్ చేసి.. తమకు చేయలేదని ఆ 91మంది ఆవేదన వ్యక్తం చేశారు.