ప్రజలకు సకాలంలో సేవలందించండి: జేసీ
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:20 AM
: ఫీడ్‌బ్యాక్‌లో గుర్తించిన సమస్యలను వెం టనే పరిష్కరించాలని, ప్రజలకు మరింత సకాలంలో మెరుగైన సేవలు అందిం చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధ వన్ కోరారు.
గరివిడి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఫీడ్‌బ్యాక్‌లో గుర్తించిన సమస్యలను వెం టనే పరిష్కరించాలని, ప్రజలకు మరింత సకాలంలో మెరుగైన సేవలు అందిం చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధ వన్ కోరారు. బుధవారం బాగువలసలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్, ఈకేవైసీ పనులను తనిఖీచేశారు. క్షేత్రస్థాయిలో నమోదవుతున్న వివరాలను పరిశీలించా రు. అనంతరం కొండపాలెం-3 గ్రామ సచివాలయాన్ని ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తనిఖీచేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన ఆయన దరఖాస్తుదారులకు ఫోన్‌చేసి వారికి అందిన సేవలపై నేరుగా వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీ ల్దార్ సీహెచ్ బంగార్రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం ఉన్నారు.