సత్వర న్యాయం అందించండి
ABN , Publish Date - May 12 , 2026 | 12:31 AM
ఫిర్యాదుదారులను సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైం, మే 11(ఆంధ్రజ్యోతి): ఫిర్యాదుదారులను సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొని, స్వయంగా వినతులు స్వీకరించారు. చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 33 ఫిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలకు సంబంధించినవి 7, కుటుంబ కలహాలు 6, చీటింగ్ 1, ఇతర అంశాలకు సంబంధించినవి 19 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఆ కార్యక్రమంలో ఏఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్‌ఐలు రాజేష్, ప్రభావతి పాల్గొన్నారు