తుఫాన్ బాధితులకు సహాయక చర్యలు అందించండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:33 PM
ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం పర్యటించారు.
- అధికారులను ఆదేశించిన మంత్రి సంధ్యారాణి
సాలూరు, అక్టోబరు (ఆంఽధజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం పర్యటించారు. సాలూరు మునిసిపాలిటీ 9వ వార్డు కొంకి వీధితో పాటు పలు వారల్లో పర్యటించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వర్చువల్‌గా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.