నాణ్యమైన భోజనం అందించండి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:18 AM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పలుపాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పఽథకం నిర్వహణను తనిఖీచేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పలుపాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పఽథకం నిర్వహణను తనిఖీచేశారు.
ఫ శృంగవరపుకోట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. స్థానిక ప్రభుత్వో న్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన సదుపాయంపై విద్యార్థులు చేసిన ఫిర్యాదులపై స్పందించారు. నెలాఖరులోగా లోపాలను సరిదిద్దుకో వాలని, నాణ్యమైన భోజనం పెట్టకుంటే చర్యలు తీసుకుంటామని నిర్వా హకులకు హెచ్చరించారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, డైరెక్టర్లు నానిగిరి రమణాజీ, బంగారు నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, టీడీపీ మండలాధ్యక్షుడు డోకుల అచ్చంనాయుడు, కార్యదర్శి కోట్యాడ జగదీష్, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, నాయకులు కాపుగంటి వాసు, పెదగాడ రాజు, సాయిరాం, ఇందుకూరి శ్రీనిరాజు పాల్గొన్నారు.
ఫ విజయనగరం రూరల్, మార్చి 18 ( ఆంధ్రజ్యోతి): విజయనగరం లోని తోటపాలెంలో గల మండల పరిషత్ ప్రాఽథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజన పఽథకాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కాగా విజయనగరంలోని అంబేడ్కర్ కూడలి నుంచి కొత్తపేట, నీళ్ల ట్యాంకు వరకూ రోడ్డు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శంకుస్థాపన చేయనున్నారు.