Share News

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందజేయండి

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:21 AM

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ను అందజేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆదేశించారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందజేయండి

  • ఈపీడీసీఎల్‌ ఇంజనీర్లకు ఎమ్మెల్యే కళా ఆదేశం

చీపురుపల్లి, ఆగస్టు 11(ఆంధ్రజ్యో తి): రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ను అందజేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆదేశించారు. రాజాంలోని తన నివాసంలో మంగళవారం ఆయన ఈపీడీసీఎల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నందున రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చాలా అవసరమన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయ పంపు సెట్లపై ఆధారపడి ఉన్నారన్నారు. ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో ఉన్న మండలాల్లో ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఈ సమీక్షలో ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:21 AM