Share News

పారమ్మకొండపై సౌకర్యాలు కల్పించండి

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:24 AM

పెదచీపురువలస సమీపంలోని పారమ్మకొండపై పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు.

పారమ్మకొండపై సౌకర్యాలు కల్పించండి
కొండపై నుంచి అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌

పాచిపెంట రూరల్‌, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి): పెదచీపురువలస సమీపంలోని పారమ్మకొండపై పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన పారమ్మతల్లిని దర్శించుకుని కొండపై ఆకాశ నిద్ర పేరిట బస చేసిన విషయం తెలిసిందే. అనంతరం కలెక్టర్‌ బుధవారం తెల్లవారుజామున కొండపైన పరి సర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలిం చారు. కొండపైన తాగునీటి కొలనను వినియో గానికి వీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలన్నారు. తాగు నీరు, విద్యుత్‌, పర్యాటకులు రాత్రి బసకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిం చాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశించారు. మున్ముందు పారమ్మకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయనతో పాటు డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, ఎంపీడీవో బి.బి.జె.పాత్రో ఉన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:24 AM