Share News

సిరిమానోత్సవాలకు సౌకర్యాలు కల్పించండి

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:22 AM

బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ సిరిమానోత్సవాలు ఈ నెలాఖరున జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగనీయవద్దని ఎమ్మెల్యే బేబీనాయన ఆదేశించారు.

సిరిమానోత్సవాలకు సౌకర్యాలు కల్పించండి
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ సిరిమానోత్సవాలు ఈ నెలాఖరున జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగనీయవద్దని ఎమ్మెల్యే బేబీనాయన ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి, ఇతర ఇంజనీరింగ్‌ అధికా రులతో బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, సిరిమానుల ఊరే గింపు జరిగే రహదారులన్నీ సక్రమంగా ఉం చాలన్నారు. మరమ్మతులు అవసరమైతే చేపట్టాలని ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భోజరాజపురం మున్సిపల్‌ ప్రధాన వాటర్‌వర్క్స్‌ నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం తాగునీటిని రిజర్వా యర్లకు పంపింగ్‌ జరిగేలా పగడ్బ దీగా చర్యలు చేపట్టాల న్నారు. పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నుంచి వేగావతినదిలోనికి నీటిని విడుదల చేయాలని జిల్లా అధికారులను ఇప్పటికే కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు, డీఈఈ పెదిరెడ్ల కిరణ్‌ కుమార్‌, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:22 AM