Share News

కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:26 AM

కంచెడివలసలో కిడ్నీ వ్యాఽధిగ్రస్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వైద్యాధికారులను ఆదేశించారు.

కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న డాక్టర్‌ శివాజీ

మక్కువ రూరల్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కంచెడివలసలో కిడ్నీ వ్యాఽధిగ్రస్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వైద్యాధికారులను ఆదేశించారు. ‘కంచెడివలసలో కిడ్నీవ్యాధి’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. డీఎంహెచ్‌వో భాస్కరరావుతో మాట్లాడారు. కిడ్నీ బాధితులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దాంతో శుక్రవారం ఉదయం మక్కువ పీహెచ్‌సీ డాక్టర్‌ ఎల్‌.శివాజి తన సిబ్బందితో కంచెడవలస చేరుకుని బాధితుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. వారి నుంచి వివరాలను సేకరించారు. బాధితులు వాడుతున్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్‌తో మాట్లాడుతూ మోకాళ్లు, నడుం నొప్పులు అధికంగా ఉన్నాయని చెప్పారు. కుళాయిల నీటి వల్ల వ్యాఽధి సోకుతుందనే అనుమానం వారు వ్యక్తం చేశారు. ఇకపై గ్రామంలో కిడ్నీ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటా మని డాక్టర్‌ శివాజీ స్పష్టం చేశారు. అనంతరం కొయ్యాపేటలో ముగ్గురు వ్యక్తులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారి ఇళ్లకు వెళ్లి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ కొయ్యానపేట, కంచెడివలస గ్రామాల్లో 9 మంది కిడ్నీ బాధితులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో ఒక్కరు తప్ప ఎవ్వరూ డయాలసిస్‌ చేయించుకోవడం లేదన్నారు. డాక్టర్‌ వెంట హెల్త్‌ సూపర్‌వైజర్‌ సరోజిని, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ఉన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:26 AM