రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:25 AM
రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహె చ్‌ఎస్ పద్మశ్రీరాణి స్థానిక ఏరియా ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.
డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి
గజపతినగరం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహె చ్‌ఎస్ పద్మశ్రీరాణి స్థానిక ఏరియా ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆమె ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ తల్లిబిడ్డల వార్డుతో పాటు మహిళలు ఉండే వార్డులపైన సోలార్‌సిస్టంను ఏర్పాటు చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోగులకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అం దించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలని.. అత్యవ సర పరిస్థితుల్లోనే రిఫర్ చేయాలని ఆమె ఆదేశించారు. అలాగే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు ఆసుప త్రిలో నిర్వహించాలని, ప్రైవేటు ల్యాబ్‌లకు తరలించ రాదన్నారు. రోగుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, వైద్యులు పాల్గొన్నారు.