Share News

మెరుగైన వైద్యసేవలు అందించండి

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:57 PM

పట్టణంలోని వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆది వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మెరుగైన వైద్యసేవలు అందించండి
రోగులతో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆది వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒకే మంచంపై ఇద్దరు రోగులను చూసి ఆవేదన చెందారు. తన తండ్రి, సాలూరు మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలు పేరిట 10 మంచాలు అందజేస్తానని వెంటనే మంత్రి ప్రకటించారు. సంధ్యారాణి ప్రకటనతో అనంతరం ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు ఇందు పూరి నారాయణరావు 10, మాజీ మార్కెటింగ్‌ చైర్మన్‌ కేతిరెడ్డి చంద్రశేఖర్‌ 5 మంచాలు అందజేయనున్నట్టు వెల్లడించారు. సాలూరు ప్రాంత వైద్యుడు గణేశ్వరరావు ప్రాణదాత ట్రస్టు ద్వారా 12 మంచాలు ఇచ్చినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ అత్యుత్తమ వైద్య సేవలతో పాడు ప్రజారోగ్య రక్షణలో అగ్రస్థానంలో నిలవాలని ఆకాం క్షించారు.

Updated Date - Sep 20 , 2026 | 11:57 PM