మెరుగైన వైద్య సేవలందించండి
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:28 AM
జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావుకు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి సూచించారు.
సీతంపేట,జూలై 18(ఆంధ్రజ్యోతి): జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావుకు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి సూచించారు. సీతంపేట ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో విజయపార్వతి ఆసుపత్రిని శని వారం సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఈ సంద ర్భంగా వార్డులను పరిశీలించారు. జ్వరపీడితులకు బెడ్లను సమకూర్చాలని, రో గులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు.