‘మెరుగైన వైద్యసేవలు అందించండి’
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:28 AM
ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్‌సీడీ పీవో డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు.
జియ్యమ్మవలస, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్‌సీడీ పీవో డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. బుధ వారం జియ్యమ్మవలస పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రోగుల సంఖ్య, చికిత్స వివరాలు, ఈహెచ్‌ఆర్ నమోదును పరిశీలించారు. ల్యాబ్‌లో జ్వర నిర్ధారణకు నిర్వహిం చిన ఆర్‌డీటీ, రక్త పూతల పరీక్షలు, వాటి నివేదికలు రికార్డులను తనిఖీ చేశారు. వ్యాక్సిన్ నిల్వలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక గిరిజన సంక్షేమ వసతిగృహం, జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హెల్త్ స్ర్కీనింగ్‌పై ఆరా తీశారు. కార్యక్రమంలో డాక్టర్ పి.సాయి ప్రసన్న, ప్రధానోపాధ్యాయుడు వి.ధనుంజయనాయుడు, కేఏఎస్ కుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు.