Share News

ఖాళీ బిందెలతో నిరసన

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:21 AM

మండలంలోని సంకిలి ఎస్సీ కాలనీ మహిళలు తాగు నీటి కొరతపై శుక్రవారం స్థాని క సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

 ఖాళీ బిందెలతో నిరసన

రేగిడి, జూన్‌ 5(ఆంధ్రజ్యో తి): మండలంలోని సంకిలి ఎస్సీ కాలనీ మహిళలు తాగు నీటి కొరతపై శుక్రవారం స్థాని క సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో రక్షితనీటి సరఫరా నిర్వహణ ఏమాత్రం బాగోలేద ని, మూడు రోజుల కొకసారి నీరు రావటం కష్టంగా ఉందని, ప్రస్తుతం ఎస్సీ కాలనీలో ఉన్న రక్షిత ట్యాంకు పైప్‌లైన్‌ వాల్వ్‌ పోయినా ఎవరూ పట్టించుకోవటం లేదని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా చిన్నయ్యపేట సెంటర్‌లో తమ గ్రామానికి రావాల్సిన వాల్వ్‌ తిప్పటంలోను సిబ్బంది సరిగా వ్యవహరించటం లేదని, దీనిపై ఆర్‌డబ్ల్యూ ఎస్‌ సిబ్బంది సరైన పర్యవేక్షణ లేదని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న సచివా లయ సిబ్బంది పాడైన వాల్వ్‌ను సాయంత్రానికి బాగు చేసి తాగునీరు అంది స్తామని సర్ది చెప్పటంతో మహిళలు ఆందోళన విరమించారు.

Updated Date - Jun 06 , 2026 | 12:21 AM