Share News

Protest రాళ్లుతేలిన రోడ్డుపై మోకాళ్లపై నిరసన

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:11 AM

Protest on Knees Over the Rocky Road రోడ్డు సమస్య పరిష్కరించాలని జరడ గిరిజన గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాళ్లు తేలిన గ్రామ రహదారిపై అర్ధనగ్న నిరసనకు దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకుంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరి స్తామని వారు వెల్లడించారు.

Protest   రాళ్లుతేలిన రోడ్డుపై మోకాళ్లపై నిరసన
రాళ్లు తేలిన రోడ్డుపై నిరసన తెలుపుతున్న జరడ వాసులు

  • లేకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని వెల్లడి

కురుపాం రూరల్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రోడ్డు సమస్య పరిష్కరించాలని జరడ గిరిజన గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాళ్లు తేలిన గ్రామ రహదారిపై అర్ధనగ్న నిరసనకు దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకుంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరి స్తామని వారు వెల్లడించారు. వాస్తవంగా నీలకంఠాపురం- జరడ తొమ్మిది కిలోమీటర్ల రహదారి కోసం జరడ వాసులు దశాబ్దాల కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో కొంతమేర రోడ్డు నిర్మించినప్పటికీ నాణ్యతా లోపం వల్ల పూర్తిగా పాడైంది. ప్రస్తుతం ఆ మార్గంలో బైక్‌ కూడా వెళ్లలేని పరిస్థితి. జరడ ఘాట్‌రోడ్డులో ఒక వైపు కొండ, మరో వైపు లోయ ఉంటుంది. లోయవైపు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించక పోవడంతో రోడ్డు తరచూ కోతకు గురవుతుంది. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రామస్థులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన జరడ గ్రామస్థులు రాళ్లు తేలిన రోడ్డుపై మోకాళ్లపై నిల్చొని అర్ధనగ్న నిరసన చేపట్టారు. రోడ్డు నిర్మిస్తే జరడ, జంపరకోట, పొడిదుం, గెడ్డగూడ, పటాయిగెడ్డ, మూలిగూడ, ఈతమానుగూడ, నెమాలిమానుగూడతో పాటు మర్గ మధ్యలో ఉండే సుక్కుగాడి డూడ, డంగలగూడ, పొక్కిరి, భీంపురం, గానలి వంటి గ్రామాల్లో వేలాది మంది గిరిజనులకు ఉపయోగకంగా ఉంటుందని, దారి కష్టాలు తప్పుతాయని వారు తెలిపారు.

Updated Date - Sep 02 , 2026 | 12:11 AM