చేపల చెరువులను అప్పగించాలంటూ నిరసన
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:28 AM
ఎటువంటి ఆధారంలేని కొండగంగుబూడి గ్రామ గిరిజన యువతకు అదే పంచాయతీలో ఉన్న చేపల చెరువులను అప్పగించి.. ఉపాధి కల్పించాలని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్, గ్రామ మాజీ సర్పంచ్ చల్లా వెంకటరావులు డిమాండ్ చేశారు.
కొండగంగుబూడి గిరిజన యువత రాస్తారోకో
వేపాడ, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఎటువంటి ఆధారంలేని కొండగంగుబూడి గ్రామ గిరిజన యువతకు అదే పంచాయతీలో ఉన్న చేపల చెరువులను అప్పగించి.. ఉపాధి కల్పించాలని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్, గ్రామ మాజీ సర్పంచ్ చల్లా వెంకటరావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ గ్రామ గిరిజన యువతతో కలిసి గురువారం బొద్దాం రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. అలాగే వంటావార్పు చేపట్టారు.