నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:17 AM
నీట్ పేప ర్ లీకేజీకి వ్యతిరేకంగా ఎస్.కోట దేవీబొమ్మ కూడలిలో సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేప ట్టారు.
శృంగవరపుకోట, జూలై 20(ఆంధ్రజ్యోతి): నీట్ పేప ర్ లీకేజీకి వ్యతిరేకంగా ఎస్.కోట దేవీబొమ్మ కూడలిలో సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేప ట్టారు. ఈ లీకేజీ కారణంగా 18 మంది విద్యార్థు లు మృతిచెందారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రమేష్ పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.రత్న, వి.చరణ్, ఎ.అనిత, కేశవ తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి, జూలై 20(ఆంధ్రజ్యోతి): నీట్ ప్రశ్న పత్రం లికేజీ కేసులో చేతులెత్తేసిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని తక్షణమే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం చీపు రుపల్లిలోని మెయిన్ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గాంధీ బొమ్మ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పి.రమేష్, కళాశాలల విద్యా ర్థులు పాల్గొన్నారు.
విజయనగరం, కలెక్టరేట్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్ష పేపర్ లీకేజేకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీఐటీయూ నాయకులు డిమాం డ్ చేశారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి, అనంతరం పీజీఆర్‌ఎస్‌లో విన్నవించారు. వాంగ్‌చుక్ 21 రోజులు గా నిరవధిక దీక్షలు చేస్తే.. సమస్య పరిష్కారం చేయ కుండా అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు.