HPV Vaccine హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో రక్షణ
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:05 PM
Protection with HPV Vaccine మహిళల నుగర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతగానో దోహదప డుతుందని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శనివారం సీతానగరం పీహెచ్‌సీలో నిర్వహించిన వ్యాక్సి నేషన్, అర్హుల జాబితా, తల్లిదండ్రుల అంగీకార పత్రాలను పరిశీలించారు.
సీతానగరం, మార్చి14 (ఆంధ్రజ్యోతి): మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతగానో దోహదప డుతుందని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శనివారం సీతానగరం పీహెచ్‌సీలో నిర్వహించిన వ్యాక్సి నేషన్, అర్హుల జాబితా, తల్లిదండ్రుల అంగీకార పత్రాలను పరిశీలించారు. ఆన్‌లైన్ నమోదును తనిఖీ చేసి.. ఇప్పటివరకు ఎంతమంది బాలికలకు వ్యాక్సిన్ వేశారో తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 15 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తిచేయాలని వైద్యాధికా రులను ఆదేశించారు. వ్యాక్సి నేషన్‌కు ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు.