Share News

45 Polling Stations 45 పోలింగ్‌ కేంద్రాలకు ప్రతిపాదనలు

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:49 AM

Proposals Submitted for 45 Polling Stations ఓటర్ల సౌకర్యార్థం జిల్లాలో కొత్తగా 45 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 1032 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, కొత్తవాటికి ఆమోదం లభిస్తే వాటి సంఖ్య 1077 వరకు పెరగనుందని వెల్లడించారు.

 45 Polling Stations  45 పోలింగ్‌ కేంద్రాలకు ప్రతిపాదనలు
మాట్లాడుతున్న‌ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఓటర్ల సౌకర్యార్థం జిల్లాలో కొత్తగా 45 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 1032 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, కొత్తవాటికి ఆమోదం లభిస్తే వాటి సంఖ్య 1077 వరకు పెరగనుందని వెల్లడించారు. ‘పాలకొండ నియోజకవర్గంలో (ఎస్టీ)లో ప్రస్తుతం 287 పీఎస్‌లు ఉన్నాయి. అయితే అదనంగా 20 కొత్త పీఎస్‌లకు ప్రతిపా దించాం. రెండు చోట్ల పోలింగ్‌ కేంద్రాల స్థలాలు, ఐదు చోట్ల పేర్ల మార్పులకు కూడా అవకాశం ఉంది. కురుపాం (ఎస్టీ)లో 269 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. కొత్తగా మూడింటిని పెంచాల్సి ఉంది. పార్వతీపురం (ఎస్సీ)లో ప్రస్తుతం 233 పీఎస్‌లు ఉండగా.. తొమ్మిది కొత్తగా ఏర్పాటు కానున్నాయి. సాలూరు(ఎస్టీ)లో ప్రస్తుతం 243 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. మరో 13 కేంద్రా లకు ప్రతిపాదనలు పంపించాం. అదే విధంగా ఐదు చోట్ల పోలింగ్‌ కేంద్రాల స్థల మార్పులు, మూడు చోట్ల పేర్ల మార్పులకు కూడా ఆమోదం లభించాల్సి ఉంది.’ అని కలెక్టర్‌ తెలిపారు.

ఎన్యూమరేషన్‌ ఫారాల పరిశీలన పూర్తి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా జిల్లాలో శతశాతం మేర ఎన్యూమరేషన్‌ ఫారాల పరిశీలన పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. నాలుగు నియోజకవర్గాల్లో 7,90,562 మంది ఓటర్లు ఉండగా.. 7,15,450 ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయిందన్నారు. మర ణాలు, వలసలు, చిరునామా మార్పులు తదితర కారణాలతో 75,112 ఫారాలు సేకరించలేనివిగా నమోదయ్యాయని వెల్లడించారు. ఈనెల 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తా మన్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లయిమ్‌లు స్వీకరించనున్నట్టు చెప్పారు. ఓటర్లు జాబితాలో తమ వివరాలు పరిశీలించుకుని.. నమోదు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jul 27 , 2026 | 12:49 AM