రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదన
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:22 AM
తోటపల్లి పరిధిలోని పాత రెగ్యులేటర్ వద్ద రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదన లను ఉన్నతాధికారులకు పంపిస్తామని రెగ్యులేటర్ డీఈ గోవిందరావు తెలిపారు.తోటపల్లి పరిధిలోని పాత రెగ్యులేటర్ తో పాటు దేవస్థానానికి ఆనుకుని ఉన్న స్పీడ్‌బ్రేకర్లను శనివారం గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్‌తో పాటు రెగ్యులేటర్ డీఈ గోవిందరావులు పరిశీ లించారు.
గరుగుబిల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):తోటపల్లి పరిధిలోని పాత రెగ్యులేటర్ వద్ద రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదన లను ఉన్నతాధికారులకు పంపిస్తామని రెగ్యులేటర్ డీఈ గోవిందరావు తెలిపారు.తోటపల్లి పరిధిలోని పాత రెగ్యులేటర్ తో పాటు దేవస్థానానికి ఆనుకుని ఉన్న స్పీడ్‌బ్రేకర్లను శనివారం గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్‌తో పాటు రెగ్యులేటర్ డీఈ గోవిందరావులు పరిశీ లించారు. శనివారం ఆంధ్రజ్యోతిలో రక్షణ గోడలు కూలిపోయి.. తోటపల్లి పాత రెగ్యులేటర్ రోడ్డుపై రహదారి శిథిలావస్థకు చేరి శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో స్పందించారు. ఈ సందర్భంగా స్పీడ్‌బ్రేకర్లు పరిస్థితితోపాటు ప్రా జెక్టుకు ఆనుకునిఉన్న పాతరెగ్యులేటర్ రక్షణ గోడలను పరిశీలించారు. ప్రధాన కల్వర్టుకు ఆనుకుని ఉన్న బీటీ రహదారి ఇరువైపులా కోతకు గురయ్యిందని, పిచ్చిమొక్కలు తొలగింపు వంటి చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. వాహన చోదకులు ప్రమాదాలబారిన పడకుండా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టడతామని తెలిపారు.