Share News

మహాశివరాత్రి జాతరకు పక్కా ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:23 AM

ప్రసిద్ధ పుణ్యక్షే త్రం రామతీర్థం రామస్వామి దేవస్థానం వద్ద ఫిబ్రవరి 15న జరుగనున్న మహాశివరాత్రి జాతరను విజయవం తం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

మహాశివరాత్రి జాతరకు పక్కా ఏర్పాట్లు చేయాలి

  • ఎమ్మెల్యే నాగమాధవి

నెల్లిమర్ల, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షే త్రం రామతీర్థం రామస్వామి దేవస్థానం వద్ద ఫిబ్రవరి 15న జరుగనున్న మహాశివరాత్రి జాతరను విజయవం తం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ఈ మేరకు మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై రామతీ ర్థం దేవస్థానం వద్ద శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు అధ్య క్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్య లు చేపట్టాలన్నారు. జాతరలో మద్యం అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్‌ అధికారులు నిఘా ఉంచాలని ఆమె ఆదేశించారు. పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచేందు కు పంచాయతీరాజ్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవ హరించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరా సమస్య లు తలెత్తకుండా ఆ శాఖాధికారులు పటిష్టమైన చర్య లు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంపుదల చేయాల న్నారు. తాత్కాలిక మరు గుదొడ్లు, స్నానపు గదులు ఎక్క డికక్కడ ఏర్పాటు చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ కె.శ్రీకాంత్‌, డిప్యూటీ ఎంపీడీవో శంకర జగన్నాథం, ఎక్సైజ్‌ ఏఈ ఎస్‌.దొర, ఎస్‌ఐ నాగేశ్వరరావు, భోగాపురం రూరల్‌ సీఐ జి.రామకృ ష్ణ, నెల్లిమర్ల ఎస్‌ఐ బి.గణేష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ జమ్ము వైకుంఠంనాయు డు, ఏఈ ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ జేఈ నందకు మార్‌, అగ్నిమాపక అధికారి షేక్‌ మదీనా, విద్యుత్‌ శాఖాధికారి రామరాజు, ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారు లు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:23 AM