APEPDCL ఏపీఈపీడీసీఎల్‌లో పలువురికి పదోన్నతులు, బదిలీలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:17 AM
Promotions and Transfers for Several Employees in APEPDCL ఏపీఈపీడీసీఎల్‌లో పలువురు అధికారులకు పదోన్న తులు, బదిలీలు కల్పించారు. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పి.త్రినాఽథరావు నియామకమయ్యారు.
పార్వతీపురం, జూన్1(ఆంధ్రజ్యోతి): ఏపీఈపీడీసీఎల్‌లో పలువురు అధికారులకు పదోన్న తులు, బదిలీలు కల్పించారు. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పి.త్రినాఽథరావు నియామకమయ్యారు. ఆయన విజయనగరం నుంచి బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. ఇప్పటివరకు మన్యంలో ఎస్‌ఈగా పనిచేసిన కె.మల్లికార్జునరావుకు కమర్షియల్ జనరల్ మేనేజర్‌గా బదిలీ అయ్యింది. విశాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.రామినాయుడును పార్వతీపురానికి బదిలీ చేశారు. ఇక పార్వతీపురంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.లక్ష్మీనారాయణను విజయనగరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. పార్వతీపురంలో ఆపరేషన్ సెక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఏ.గోపాలరావును విజయనగరం గ్రామీణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బదిలీ చేశారు.