Share News

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:20 AM

జిల్లాలో చిరుధాన్యాల (మిల్లెట్స్‌) సాగును ప్రోత్సహించడంతో పాటు, ఒక భారీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ స్థాపనకు అడుగులు పడాలని ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు.

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో వైశాలి

పార్వతీపురం, జూలై18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చిరుధాన్యాల (మిల్లెట్స్‌) సాగును ప్రోత్సహించడంతో పాటు, ఒక భారీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ స్థాపనకు అడుగులు పడాలని ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, దిగుబడి సామర్థ్యం, ఉత్పత్తి గణాంకాలను డీఈఏ అన్నపూర్ణ తెలియజేశారు. ప్రస్తుతం రస్తాకుంటుబాయి కేవీకేలో ఉన్న మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యంత్రాలు, చిరుధాన్యాలతో తయారు చేసే విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా శాస్త్రవేత్త ఉమాజ్యోతి వివరించారు. మన్యంలో లభించే చిరు ధాన్యాలకు ప్రాసెసింగ్‌ యూనిట్‌ తోడైతే, గిరిజన రైతులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయని పీవో వైశాలి అభి ప్రాయపడ్డారు. సాగు, ఉత్పత్తి, మార్కెటింగ్‌ అవకాశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి క్షే త్రస్థాయిలో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 19 , 2026 | 12:03 PM