లాభదాయక పంటలు సాగు చేయాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:27 AM
రైతులు కాలానుగునంగా పంటలు మార్పిడితోపాటు లాభదాయకమైన పంటలు సాగు చేయాలని కలెక్టర్ ఎం.ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మండలంలోని గిరిశిఖర జకూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థుల సమస్య లను తెలుసుకున్నారు.
కొమరాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రైతులు కాలానుగునంగా పంటలు మార్పిడితోపాటు లాభదాయకమైన పంటలు సాగు చేయాలని కలెక్టర్ ఎం.ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మండలంలోని గిరిశిఖర జకూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థుల సమస్య లను తెలుసుకున్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గ్రామస్థులు ఐకమత్యంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనం తరం సరుగుడుగూడ జంక్షన్ వద్ద నాగావళి నదీ ప్రవాహాన్ని పరిశీలించి నదీ పరివాహక గ్రామాలకు వరదప్రవాహ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో డీఆర్‌డీఏపీడీ ప్రభావతి, జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు, తహసీల్దార్ చిన్నారావు పాల్గొన్నారు.