Share News

భక్తిశ్రద్ధలతో పైడిమాంబ కలశ జ్యోతి ఊరేగింపు

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:07 AM

పైడిమాంబ సిరిమానోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి కలశ జ్యోతి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో పైడిమాంబ కలశ జ్యోతి ఊరేగింపు

విజయనగరం కల్చరల్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి కలశ జ్యోతి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.శిరీష ఆధ్వర్యంలో పైడిమాంబ మాలధారణ చేసిన భక్తులు ఈ కలశజ్యోతి ఊరేగింపులో పాల్గొన్నారు. రైల్వేస్టేషన్‌ రోడ్డు లో ఉన్న వనంగుడి నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు చదురు గుడి ఆలయం వరకూ సాగింది. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం పైడిమాంబ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత వనం గుడిలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు.

Updated Date - Nov 08 , 2026 | 01:07 AM