గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:31 AM
గ్రామస్థాయిలోనే అర్జీలను స్వీకరించి సంబంధిత సమస్యలను గ్రామ ఇన్‌చార్జిలు పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు.
భామిని, జనవరి23 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలోనే అర్జీలను స్వీకరించి సంబంధిత సమస్యలను గ్రామ ఇన్‌చార్జిలు పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన పీజీఆర్‌ఆర్‌కు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని ఏనేటి కులాలకు ఎస్టీలుగా గుర్తించి ధ్రువప త్రాలు ఇవ్వాలని నేరడి, బిల్లుమడ, పసుకుడి, పెద్దదిమిలి గ్రామానికి చెందిన మహిళలు, విద్యార్థులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివన్నారాయణ, ఎస్.వసంతకుమారి పాల్గొన్నారు.