Share News

‘ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:15 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ జిల్లా కన్వీనరు సురేష్‌, ప్రధాన కార్యదర్శి పైడిరాజులు కోరారు.

 ‘ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’
ఎంపీ కలిశెట్టికి వినతిపత్రం అందిస్తున్న ఏపీ జేఏసీ ప్రతినిధులు

విజయనగరం దాసన్నపేట, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ జిల్లా కన్వీనరు సురేష్‌, ప్రధాన కార్యదర్శి పైడిరాజులు కోరారు. ఈ మేరకు వారు ఆదివారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు డా.సురేష్‌బాబు, గాదే శ్రీనివాసులనాయుడులను కలిసి, వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటివరకూ ఉద్యోగుల బకాయిలు, ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలకు పదవీ విరమణ వయస్సు పెంపు వంటి సమస్యలు అమలు చేసినప్పటికీ, ప్రధానమైన సమస్యలు పీఆర్‌సీ కమిషన్‌, ఐఆర్‌ ప్రకటన, డీఏ బకాయిలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు వంటివి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్ర కమిటీ ప్రతినిధుల ఆదేశాలమేరకు ప్రజాప్రతినిధులను కలిసి ప్రభుత్వానికి వివరించాలని కోరారు. జేఏసీ ప్రతినిధులు శ్రీధర్‌బాబు, చంద్రశేఖర్‌, గోపీనాథ్‌, కళావతి, పి.శ్రీనివాస్‌, ఏవీ శ్రీనివాస్‌, సీహెచ్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:15 AM