సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:08 AM
రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించాలని జిల్లా డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు చొక్కాపు రామారావు కోరారు.
డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామారావు
రామభద్రపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించాలని జిల్లా డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు చొక్కాపు రామారావు కోరారు. మంగళవారం రామ భద్రపురంలో తహసీల్దార్ అజురఫీజాన్‌కు వినతిప త్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రేషన్‌డీలర్లకు కమీషన్ అతి తక్కువగా ఇవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పా రు. బియ్యం తూకం వేయడానికి ప్రతి డీలరుకు హెల్పర్‌ను నియమించాలని, రేషన్ డీలర్లకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, ఎంఎల్‌ఎస్ పాయిం ట్ నుంచి క్యూఆర్ స్యాన్ చేసి సరైన తూకం వేసి రేషన్ డిపోలకు కీ ఇవ్వాలని కోరారు. రేషన్ డీలర్లు అకాల మరణం చెందితే వారికి ఆర్థిక సహకారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో డీలర్ల సం ఘ మండలాధ్యక్షుడు వెంకటరమణ పాల్గొన్నారు.