Share News

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:14 AM

సబ్‌ జైలులో ఉన్న ఖైదీలు సత్ప్ర వర్తనతో మెలగాలని జిల్లా అదనపు న్యాయాధికారి వివేక్‌ ఆనంద్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం పాలకొండలోని సబ్‌జైలును జిల్లా న్యాయసేవాధికార సం స్థ కార్యదర్శి కె.హరిబాబు, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి సీహెచ్‌ హరిప్రి యతో కలిసి సందర్శించారు.

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
మాట్లాడుతున్న న్యాయాధికారులు:

పాలకొండ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): సబ్‌ జైలులో ఉన్న ఖైదీలు సత్ప్ర వర్తనతో మెలగాలని జిల్లా అదనపు న్యాయాధికారి వివేక్‌ ఆనంద్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం పాలకొండలోని సబ్‌జైలును జిల్లా న్యాయసేవాధికార సం స్థ కార్యదర్శి కె.హరిబాబు, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి సీహెచ్‌ హరిప్రి యతో కలిసి సందర్శించారు. ఈమేరకు ఖైౖదీలతో సమావేశం నిర్వహించి వారి యోక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని జిల్లా సూపరింటెండెంట్‌ బి.జోగులుకు ఆదేశించారు. కార్య క్రమంలో జి.రమణయ్య, బి.నరసింహులు, నాయుడు, హరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:14 AM