Share News

‘ఖైదీలకు పరివర్తన అవసరం’

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:01 AM

క్షణికావేశంలో లేదా ఇతరత్రా కారణాలతో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే అలాంటి వారిలో పశ్చాత్తాపం, పరివర్తన చాలా ముఖ్యమని బొబ్బిలి కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణ మూర్తి అన్నారు.

‘ఖైదీలకు పరివర్తన అవసరం’
మాట్లాడుతున్న న్యాయాధికారి రాధాకృష్ణమూర్తి

బొబ్బిలి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో లేదా ఇతరత్రా కారణాలతో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే అలాంటి వారిలో పశ్చాత్తాపం, పరివర్తన చాలా ముఖ్యమని బొబ్బిలి కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణ మూర్తి అన్నారు. ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుఇని శుక్రవారం స్థానిక సబ్‌జైలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలలో మానవతా విలువలను పెంపొందించి వారిలో సానుకూల దృక్పథం, వైఖరిని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నేరానికి శిక్షను అనుభవిస్తున్న వారంతా సమాజంలో భాగమేనని, వారి హక్కులు, గౌరవం, ఆరోగ్యం, భద్రతను కాపాడడం చట్టపరంగా ఎంతో ముఖ్యమన్నారు. బాధ్యతాయుత మైన పౌరులుగా వారిని తయారు చేయడం అందరి కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి హేమ స్రవంతి జానకీరామ్‌, ఫస్ట్‌క్లాస్‌ అడిషనల్‌ జుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ ఎం.రోహిణీరావు, న్యాయవాదులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న న్యాయాధికారి రాధాకృష్ణమూర్తి

Updated Date - Oct 03 , 2026 | 01:01 AM