రామతీర్థం దేవస్థానానికి ప్రాధాన్యం కల్పిస్తాం
ABN , Publish Date - May 23 , 2026 | 11:14 PM
రామతీర్థం దేవస్థానానికి ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత కల్పి స్తామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ నాయకుడు కొణిదెల నాగబాబు అన్నారు.
-ఎమ్మెల్సీ నాగబాబు
- గిరి ప్రదక్షిణ రోడ్డు పరిశీలన
నెల్లిమర్ల, మే 23(ఆంధ్రజ్యోతి): రామతీర్థం దేవస్థానానికి ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత కల్పి స్తామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ నాయకుడు కొణిదెల నాగబాబు అన్నారు. శనివారం ఆయన రామతీర్థం రామస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలాచలం బోడికొండ చుట్టూ తాజాగా నిర్మించిన గిరిప్రద క్షిణ రహదారిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవస్థానం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ.3కోట్లతో గిరి ప్రదక్షిణ రోడ్డును నిర్మించా మని చెప్పారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చనమల్ల వెంకటరమణ, కరుముజ్జి గోవిందరావు, రవ్వా నానీ, ఎంఎం నాయుడు, ఎడ్ల గోవిందరావుతో పాటు 4 మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.