Revenue Issues రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:05 PM
Priority to Resolving Revenue Issues సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న విలేజ్ రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో తహసీల్దార్లతో సమీక్షించారు.
పార్వతీపురం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న విలేజ్ రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో తహసీల్దార్లతో సమీక్షించారు. వివిధ రెవెన్యూ పనుల పురోగతిపై ఆరా తీసి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ పైళ్లను సకాలంలో పూర్తి చేయాలని జేసీ సూచించారు. మ్యూటేషన్లు, సర్వే సంబంధిత పనుల్లో జాప్యం ఉండకూడదన్నారు. ప్రతి తహసీల్దార్ తమ పరిధి లోని రెవెన్యూ పనులను నిరం తరం పర్యవేక్షించాలని తెలిపారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చ క్రవర్తి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.