Share News

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:31 AM

ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

  • ఎమ్మెల్యే కోండ్రు

రాజాం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. స్థానిక ఏరియా ఆసుప త్రిలో ఏర్పాటుచేసిన నూతన ప్రసూతి వార్డును ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గర్భిణులు, బాలింతల వార్డులో వేడినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, అదనంగా మరో వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దామోదర ప్రదాన్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బొత్స వాసుదేవరావునాయు డు, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షు డు నంది సూర్యప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:31 AM